
ఎన్నికల్లో పోలీసుల పాత్ర భేష్
మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర భేష్ అని ఎస్పీ ప్రభాకర్‌రావు కితాబి చ్చారు. మండలంలోని నందిపాడు టీఎ న్‌ఆర్ ఫంక్షన్‌హాల్లో మిర్యాలగూడ
మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్ :మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర భేష్ అని ఎస్పీ ప్రభాకర్‌రావు కితాబి చ్చారు. మండలంలోని నందిపాడు టీఎ న్‌ఆర్ ఫంక్షన్‌హాల్లో మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు అధికారు లు, సిబ్బందికి బుధవారం నిర్వహించి న ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో అవాంఛనీ య సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు అభినందనీయమన్నారు. తీవ్ర పని ఒత్తిడిలో కూడా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారు లు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సినీ ఆర్టిస్టులు జనార్దన్, వెంకటేశ్వర్లు నిర్వహించిన మ్యాజిక్‌షో, పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమారాజేశ్వరి, ఓఎస్‌డీ సుధాకర్‌రెడ్డి, డివిజనల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ సుభాష్‌చంద్రబో స్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సురేష్, సీఐలు సుదర్శన్‌రెడ్డి, శివశంకర్‌గౌడ్, ఎస్‌ఐలు రాహుల్‌దేవ్, వెంకటేశ్వర్లు, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.