సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, సాహితీవేత్త ద్వా.నా. శాస్త్రి (72) కన్నుమూశారు. గత అర్థరాత్రి ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ద్వానా శాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా ద్వా.నా.శాస్త్రి అని పిలవబడే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15 వ తేదీన జన్మించారు. సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వానా శాస్త్రి విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేసిన ఏకైక వ్యక్తి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment