కొడవటిగంటి వరూధిని కన్నుమూత  | Kodavatiganti Family Varudhi Passed Away | Sakshi
Sakshi News home page

కొడవటిగంటి వరూధిని కన్నుమూత 

Published Thu, Feb 10 2022 3:46 AM | Last Updated on Thu, Feb 10 2022 3:46 AM

Kodavatiganti Family Varudhi Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొడవటిగంటి కుటుంబరావు భార్య, దివంగత రచయిత్రి శాంతసుందరి తల్లి శ్రీమతి వరూధిని (97) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ప్రముఖ నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతి, పాత్రికేయులు కొమ్మూరి వెంకట్రామయ్యలకు 29 మార్చి 1925లో గుంటూరులో వరూధిని జన్మించారు.

ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు. కుటుంబరావును  1945లో వివాహమాడారు. అప్పటి నుంచీ, కొకు రాసిన ప్రతీ రచనను భద్ర పరి చారు. కొడుకు రోహిణి ప్రసాద్‌(49) అణుశాస్త్రవేత్త, సైన్స్‌ రచయిత 2012లో అనారోగ్యంతో మరణించారు. వరూధిని కూతురు, సాహిత్య అకాడమీ అవార్డ్‌ గ్రహీత శాంత సుందరి (72) కేన్సర్‌తో ఇటీవలే మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement