మళ్లొస్తా..
ముగిసిన మొదటి విడత యాత్ర
చివరి రోజు నాలుగు కుటుంబాలకు పరామర్శ
ఐదు రోజులు.. 32 కుటుంబాలకు ఓదార్పు
అడుగడుగునా నీరాజనం
వరంగల్ : సంక్షేమ పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శ యాత్ర ముగిసింది. ఆగస్టు 24 నుంచి 28 వరకు సాగిన పరామర్శయాత్రలో భాగంగా షర్మిల జిల్లాలో 32 కుటుంబాలను ఓదార్చారు. ఐదో రోజు శుక్రవారం పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లోని నాలుగు కుటుంబాలను పరామర్శించారు. గీసుగొండ మండలం మరియపురం నుంచి తీగరాజుపల్లి, రామచంద్రాపురం, ఏనుగల్లు, సాయిరెడ్డిపల్లె, దౌలత్‌నగర్, పర్యతగిరి, కల్లెడ, అన్నారం మీదుగా సో మారంలో యాత్ర ముగిసింది. మృతుల కుటుంబ స భ్యులను కలుసుకొని పరామర్శించారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. పరామర్శ యాత్ర సందర్భంగా జిల్లాలో షర్మిల పర్యటనకు మంచి స్పందన కనిపించింది. తొలి విడతలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో షర్మిల పరామర్శ యాత్ర సాగింది. గ్రేటర్ వరంగల్‌తోపాటు అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది.
ఏడోరోజు యాత్ర సాగిందిలా..
పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం గీసుగొండ మండలం మరియపురం నుంచి బయలుదేరారు. సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వర్షాలు సకాలంలో కురవక, పంటలు పండక జీవనం ఇబ్బందిగా మారిందని అక్కడి వారు షర్మిలకు చెప్పారు. మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని షర్మిల వారికి చెప్పారు. అనంతరం పర్వతగిరి మండలం ఏనుగల్లులోని పెడ్యాల చంద్రకళ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. తర్వాత పర్వతగిరిలోని పల్లూరి కొమురమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. చివరగా తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. చివరి రోజు సాగిన పరామర్శయాత్ర మార్గంలోని ప్రతి ఊరిలో, తండాల్లో ప్రజలు రహదారుల వెంట ఉండి ప్రజలు షర్మిలకు స్వాగతం తెలిపారు. ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. షర్మిల ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ‘నమస్తే అన్న.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లి.. నమస్తే పెద్దయ్య’ అంటూ ముందుకు సాగారు.
షర్మిల వెంట..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొం డా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి, ఇతర జిల్లాల అధ్యక్షులు బి.అనిల్‌కుమా ర్, ఎస్.భాస్కర్‌రెడ్డి, జి.సురేష్‌రెడ్డి, ఎం. శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బి.రఘురాంరెడ్డి, కె.కుసుమకుమార్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, కె.వెంకట్‌రె డ్డి, విలియం మునిగాల, ఎం.శంకర్, షర్మిల సంపత్, టి.నాగరావు, సెగ్గం రాజేష్, నాడెం శాంతికుమార్, జా ర్జ్ హెర్బర్ట్, జి.శివ, ఎ.సంతోష్‌రెడ్డి, ఆకుల మూర్తి, వన జ, జి.సుమన్‌గౌడ్, జె.అమర్‌నాథ్‌రెడ్డి, సాదు రమేష్‌రె డ్డి, జిల్లా నాయకులు ఎం.కల్యాణ్‌రాజు, ఎ.మహిపాల్‌రె డ్డి, నెమలిపురి రఘు, అమరేందర్‌రెడ్డి, చరణ్, మాధవరెడ్డి, కాగిత రాజ్‌కుమార్ యాదవ్, సం గాల ఇర్మియా, పుజారి సాంబయ్య, అచ్చిరెడ్డి, ఎ.కిషన్, సుమిత్‌గుప్తా, ఇతర జిల్లాల నేతలు బి.సుధాకర్, టి. ఇన్నారెడ్డి, ఎం.నిరంజన్‌రెడ్డి, ఎన్.క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.