మానవీయ విలువలు పెంపొందాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రస్తుతం సమాజంలో కుటుంబవ్యవస్థ, మనుషుల వి లువలు తగ్గిపోయాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తంచేశారు. మానవీ య విలువలు పెంపొందాలని ఆకాం క్షించారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆదర్శ డిగ్రీ కళాశాలలో ‘జిల్లా ఎస్‌బీహెచ్ పాల మూరు మిత్రుల’ ఆత్మీయసమ్మేళనం ని ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మానవత విలువలు మరుగునపడి వస్తువుల విలువుల వ్యామోహం పెరిగిందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎస్‌బీ హెచ్ మిత్రుల సమావేశం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎస్‌బీ హెచ్ రాష్ట్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షు డు శ్యాంసుందర్ మాట్లాడుతూ.. బ్యాం కులు ఈ రోజులు పటిష్టంగా ఉండి సా మాన్యులకు సేవలందిస్తున్నాయంటే బ్యాంకుల యూనియన్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అనంతరం ఎస్‌బీహెచ్ పాలమూరు మిత్రుల లోగోతోపాటు టెలిఫోర్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ వనమా ల, రిటైర్డ్ ఎస్‌బీహెచ్ అధికారులు కేవీ అశోక్, వి.నర్సింహ్మరావు, గజ్జెలయ్య, రంగయ్య, సుభాష్ పాల్గొన్నారు.
పాతపల్లి దళితులకు అండగా ఉందాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పెబ్బేర్ మండలం పాతపల్లి గ్రామ దళితులకు అండగా నిలుద్దామని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులపై దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. దళితులకు జీవించే హక్కు కల్పించాలని కోరారు. అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇక్కడి దళితులపై 20సార్లు దాడులు జరిగాయని ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఇక్కడి ప్రజాప్రతినిధులు దళితుల సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి బోయలను దళితులకు వ్యతిరేంగా రెచ్చగొడుతున్నారన్నారు. రాజకీయాల నాయకుల క్రీడల్లో ప్రజలు బలికావద్దన్నారు. ఈనెల 6వ తేదీ చలో పాతపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్న పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ఆనంద్‌తేల్‌తుంబ్డే హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం చలో పాతపల్లి పోస్టర్‌ను విడుదల చేశారు. అందుకు నిరసనంగా ఈనెల 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, చంద్రశేఖర్, యేసేపు, వామన్‌కుమార్, పూజారి పాల్గొన్నారు.