ఇక మీతో అయ్యే పనికాదు | Errabelli And Srinivas Goud Inspect On Medaram Jatara | Sakshi

ఇక మీతో అయ్యే పనికాదు

Published Sat, Jan 25 2020 5:42 AM | Last Updated on Sat, Jan 25 2020 5:42 AM

Errabelli And Srinivas Goud Inspect On Medaram Jatara - Sakshi

 మేడారంలో సమ్మక్క గద్దె వద్ద మొక్కుతున్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, దయాకర్‌రావు

ములుగు: ‘మేడారం మహా జాతరలో చేపడుతున్న పనులు అధ్వానంగా ఉన్నాయి.. జాతర సమీపిస్తున్నా ఇంకా పనులు కొనసాగుతుండటం సరికాదు.. మీతో అయ్యే పని కాదని అర్థమైపోయింది.. ఇకనైనా గతంలో జాతర పనులను పర్యవేక్షించిన అధికారులను వెంటనే రప్పించండి’ అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. ములు గు జిల్లా తాడ్వాయిలో రూ.9.37 కోట్ల వ్యయం తో నిర్మించిన హరిత కాటేజీలను శుక్రవారం ప్రారంభించారు. సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులతో సమావేశమయ్యారు.

పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది.. 
అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని మంత్రులు అసహనాన్ని వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పురోగతి కనిపించడం లేదని అన్నారు. రెండ్రోజుల్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని అధికారులను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement