సాక్షి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రోడ్ షో నిర్వహించారు. మంత్రితోపాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస కార్యకర్తలందరు దుమ్ము దులపాలని పేర్కొన్నారు. కొనారెడ్డి చెరువు నింపినా ఘనత టీఆర్‌ఎస్ పార్టీదేనని అన్నారు. చెరువులు కుంటలు నింపామని, కేసిఆర్ నాయకత్వాన్ని రైతులందరూ బలపరుస్తున్నారన్నారు. (మంత్రి గంగుల వివాదాస్పద వ్యాఖ్యలు)
అందరిని ఆదుకున్న మహానుభావుడు కేసిఆర్ అని.. వర్ధన్నపేట తనకు కన్నతల్లి లాంటిదని భావోద్వేగానికి లోనయ్యారు. వర్ధన్నపేట లో 12 వార్డులు దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి కౌన్సిలర్‌కు రూ. కోటి 50 లక్షలు ఇవ్వబోతున్నమని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు వద్దని కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయారని, మున్సిపాలిటీలో గెలిచి పనిచేయని వారిని తోలింగించే అధికారం తాము తీసుకు వచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్న 12 సీట్లు వన్ సైడ్ రావాలని, ఒక్కటి పోవద్దని అన్నారు. టిక్కెట్ రానివారికి సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి తెలిపారు.
చదవండి : మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment