సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల పటిష్టతపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను నియమించిన తరువాత తొలిసారిగా వీసీలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమావేశం కాబోతున్నారు.
చాన్స్‌లర్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వర్సిటీల పటిష్టత, నాణ్యతాప్రమాణాల పెంపు పై చర్చించనున్నట్లు తెలిసింది. వర్సిటీల్లోని పరిస్థితులను సమీక్షించి, మెరుగైన విద్యను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment