సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఎన్నికల కోడ్ అమలు చేసేందుకు అబ్కారీ శాఖ సైతం సిద్దమవుతోంది. జలమండలిలో అబ్కారీ శాఖ, ఎన్నికల కమీషన్‌తో కలిసి జరిపిన సమీక్ష ముగిసింది. ఈక్రమంలో అబ్కారీ శాఖ కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. అక్రమ మద్యం నిరోధానికి రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలని అంతేకాకుండా ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి దుకాణంలో ప్రత్యేకంగా రిజిస్టర్‌లు ఏర్పాటుచేయాలని, పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించింది.
బస్సులు, ఇతర వాహనాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తామని తెలిపింది. తరుచు నేరాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు పెడతామని హెచ్చరించింది. ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితులుంటే కఠిన చర్యలు తప్పవని, మాదక ద్రవ్యాల సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మద్యం విక్రయాలు సగటున 11.5శాతం పెరుగుదల నమోదు అయిందని పేర్కొంది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆబ్కారీ శాఖ ఇంచార్జి కమిష్‌నర్ సోమేశ్ కుమార్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 90 ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment