నల్గొండ(వలిగొండ): వలిగొండ మండలం అరువూరులో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బండారు రామిరెడ్డి(35) అనే రైతు ఊరి చివరన ఉన్న ఓ వ్యవసాయబావి వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబసమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.