
సాక్షి, హైదరాబాద్: సమీకృత వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మొదలగు రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నలుగురు రైతులతో పాటు ఒక మహిళా రైతును రాష్ట్ర స్థాయిలో గుర్తించి వారికి గౌరవ సన్మాన పురస్కారాలతో పాటు ‘రైతురత్న’అవార్డు ప్రదానం చేయాలని తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిర్ణయించింది. ఆధునిక పద్ధతుల ద్వారా సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను ఈ నెల 23లోగా అందజేయాలని తెలిపింది. వివరాలకు విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి.రంగారెడ్డి (8886861188), వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ బి.కృపాకర్‌రెడ్డి(9391409959)లను సంప్రదించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment