సాగు కోసం చేసిన అప్పులు పెనుభారంగా మారడంతో ఓ రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
మోర్తాడ్: సాగు కోసం చేసిన అప్పులు పెనుభారంగా మారడంతో ఓ రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుమ్మరి గంగారామ్ (60)కు మూడెకరాల పొలం ఉంది. ఇందులో సుమారు 20 వరకు బోర్లు వేయించినా నీటి జాడలు కనిపించలేదు. ఇందు కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగారామ్ శుక్రవారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తోటి రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.