అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమసానిపేట గ్రామంలో గురువారం వెలుగు చూసింది.
ఎల్లారెడ్డి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమసానిపేట గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కుడిపాక సాయిబాబా(36) పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కనపడక బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.