నెల్కివెంకటాపూర్‌లో రాస్తారోకో చేస్తున్న రైతులు
దండేపల్లి(మంచిర్యాల): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఓ రైతు తీవ్ర మనస్థాపాని కి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం... దండేపల్లి మండలం నెల్కివెంకటా పూర్‌కు చెందిన ఎద్దు బుచ్చన్న యాసంగిలో మూడెకరాల్లో వరి సాగుచేశాడు. పంటను విక్రయించేందుకు గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో 40 రోజుల క్రితం ధాన్యాన్ని కుప్పపోశాడు. నిర్వాహకులు కాంటా వేయడంలో నిర్లక్ష్యం చే యడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో మంగళవారం గ్రామ బస్టాండు సమీప ంలో గడ్డిమందు తాగాడు. స్థానిక రైతులు వెంటనే అతన్ని లక్సెట్టిపేట్ ఆస్పత్రికి తర లించా రు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలి ంచారు. విషయం తెలిసిన తహసీల్దార్ సంతో ష్‌కుమార్ ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని కారణా లు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతు న్న రైతును ఆర్డీవో శ్రీనివాస్ పరామర్శించారు.
రైతుల ఆగ్రహం...
కొనుగోళ్లలో నెలకొన్న జాప్యంతో రైతు ఆత్మహæత్యాయత్నానికి పాల్పడడంతో మండలంలో క లకలం రేపింది. దీంతో రహదారిపై సుమా రు రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతిసారీ రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారని, ఈసారి ఒకటే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో కొ నుగో ళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరో పించారు. ఒక్కో రైతు ధాన్యం విక్రయించేందుకు ¯ð ల రోజులకు పైగా సమ యం పడుతుందన్నారు. కొనుగోళ్ల విషయంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అదనంగా మరో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటే కొందరూ అడ్డుకుంటున్నారని, ఈ విష యం అధికారులందరికీ తెలిసిన స్పందించడ ం లేదన్నారు. ఘటన స్థలానికి తహసీల్దార్ సంతోష్ కుమార్, సీఐ నారాయణ్ నాయక్, ఎస్సై శ్రీకాంత్ వచ్చి నచ్చజెప్పిన వినిపించుకోలేదు. డీసీపీ ఉదయ్‌కుమార్, ఇన్‌చార్జి ఏసీపీ నరేందర్ వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
రైతు కుటుంబానికి పరామర్శ
మంచిర్యాలటౌన్: మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఎద్దు బుచ్చన్న కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. పార్టీ మైనా రిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్, మ హిళా అధ్యక్షురాలు పెంట రజిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పెంట రమేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment