మేనూర్‌లో రాస్తారోకో చేస్తున్న నాయకులు, రైతులు
మద్నూర్(జుక్కల్) : కంది రైతులు కన్నెర్ర చేశారు. కంది పంట కొనుగోలు కేంద్రం పునః ప్రారంభిచాలంటు రైతులు రోడెక్కారు. మండలంలోని మేనూర్‌లో జాతీయ రహదారిపై మంగళవారం బీజేపీ నాయకులు, రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మండలంలోని డోంగ్లీ సహకార సంఘంలో గత రెండు రోజుల క్రితం కంది కొనుగోలు కేంద్రం మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోంగ్లీలో కొనుగోలు కేంద్రం మూసివేస్తున్నామని రైతులు మద్నూర్ మార్కెట్‌లోని కంది కొనుగోలు కేంద్రానికి పంటను తరలించాలని అధికారులు సూచించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ రాములు అన్నారు. డోంగ్లీ చుట్టూ పక్కల ప్రాంతాల రైతులు మద్నూర్‌కు పంటను తరలించాలంటే రవాణ ఖర్చులు తడిసిమోపెడవుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు వెంటనే డోంగ్లీలో కంది కొనుగోలును ప్రారంభిచాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహమ్మద్ సాజిద్, తహసీల్దార్ ధన్వాల్ సంఘటన స్థలానికి చేరుకోని రైతులు, రైతునాయకులతో మాట్లాడారు. త్వరలో ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేౖసామని చెప్పడంతో వారు రాస్తారోకోను విరమించారు.
శనగ పంటను తీసుకోవాలి
రబీ సీజన్‌కు సంబందించి రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎంపీటీసీ రాములు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్‌లో శనగ క్వింటాలుకు రూ.3400 నుంచి రూ.3600 వరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4400 ప్రకటించిందని ఇక్కడ శనగకొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు క్వింటాల్‌కు వెయ్యి రూపాయాలు నష్టపోతున్నారని పేర్కోన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే మండలంలో అక్రమంగా కందులను రైతుల పేరిట విక్రయించిన దళారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయనతో పాటు నాయకులు, స్థానిక రైతులు ఉన్నారు.
కందులు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ సత్తయ్య దళారులు అక్రమంగా మహారాష్ట్ర నుంచి కందులను తీసుకచ్చి విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ సత్తయ్య వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనసాగుతున్న కంది కోనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. దళారులు రైతుల వద్ద నుంచి పట్టాపాస్ పుస్తకాలు సేకరించి వారి పేరున కందులు తూకం వేస్తున్నారనే ఆరోపణలు రావడంతో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రతి రోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికి చెందిన రైతుల కందులను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయాధికారులు గ్రామాలను ఎంపిక చేసి రైతులకు సమాచారం అందించాలని, రైతులు తమ పట్టాపాసు పుస్తకాలను ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అక్రమ కంది కొనుగోళ్లపై పూర్తి విచారణ జరుపుతామని, దళారులను ఆరికట్టెందుకు మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ అధికారులను నియమించామన్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సిబ్బంది ఆన్‌లైన్ పనులను వేగవంతం చేయాలన్నారు. మేనూర్‌లో రైతులు రాస్తారోకో విషయం ప్రస్తావిస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మార్కెట్ యార్డులలోనే కంది కొనుగోలు కేంద్రాలు ఉండాలన్న నిబంధనలతోనే డోంగ్లీ సోసైటీలో కంది కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారని దీనికి రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీతో పాటు తహసీల్దార్ ధన్వాల్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment