మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఫైరింజిన్లే మొరాయిస్తే..పరిస్థితి అగమ్యగోచరమే.
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఫైరింజిన్లే మొరాయిస్తే..పరిస్థితి అగమ్యగోచరమే. అలాంటి సంఘటనే ఇది. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలోని మునుగోడు రోడ్డులో వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ మెయిన్ వైరు ఆదివా రం మధ్యాహ్నం తెగిపడింది. ఆ ప్రాంతంలోని పత్తి, కందిచేలు, గడ్డివాములకు మంటలు అంటుకున్నాయి.
గాలి తోడవడంతో దాదాపు 15 ఎకరాల మేర మంటలు పాకాయి. గమనించిన స్థానికులు నల్లగొండ అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌చేయగా రెండు ఫైరింజిన్లు వ చ్చాయి. ఫైరింజిన్లు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత చాలా సేపు మొరాయించాయి. ఇంజన్ల వైపు మంటలు వస్తుండడంతో స్థానికులు వాటిని కాపాడేందుకు ఎక్కువగా శ్రమించా రు. చివరకు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.