రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం సాయిబాబా అగ్రోటెక్ కాటన్ జిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
Dec 16 2015 1:57 PM | Updated on Sep 5 2018 9:45 PM
పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం సాయిబాబా అగ్రోటెక్ కాటన్ జిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ సహాయంతో పత్తిని ఒక్కచోటికి కుప్ప చేస్తుండగా ప్రమాదవశాత్తూ పొగగొట్టం నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయి. ఫైరింజన్లు వచ్చేలోపే మంటలు మిల్లు అంతటా వ్యాపించాయి. ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. సుమారు 10 వేల క్వింటాళ్ల పత్తి బూడిద పాలయినట్లు అధికారులు అంచనావేశారు.
Advertisement
Advertisement