బోయిన్‌పల్లి: కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలం కోరెం గ్రామంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీ విస్తీర్ణంలో ఉన్న తాటి వనానికి నిప్పంటుకుంది. మొత్తం 12 ఎకరాల పరిధిలో వెయ్యికిపైగా తాటి చెట్లు ఉండగా... ఐదెకరాల పరిధిలో చెట్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే, ఈ చెట్లపై ఆధారపడిన గీత కార్మికులు తమ ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.