పాంచ్ పటాకా..! | five members from single family contest to ibrahimpatnam panchayat | Sakshi
Sakshi News home page

పాంచ్ పటాకా..!

Published Wed, Mar 19 2014 6:05 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

నీల్ల భానుబాబు, భానురేఖ, నీల్ల భానుప్రియ, అండాలు, పల్లె శ్రీధర్‌బాబు - Sakshi

నీల్ల భానుబాబు, భానురేఖ, నీల్ల భానుప్రియ, అండాలు, పల్లె శ్రీధర్‌బాబు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. విశేషమేంటంటే వీరంతా కాంగ్రెస్ అభ్యర్థులే. ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిస్ట్ స్కూల్ యజమాని నీల్ల చెన్నయ్య కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు పలు వార్డులలో కౌన్సిలర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఒకటో వార్డు నుంచి చెన్నయ్య కుమారుడు నీల్ల భానుబాబు, 15వ వార్డు నుంచి భార్య అండాలు, 4, 13 వార్డుల నుంచి కూతుళ్లు పల్లె భానురేఖ, ఎన్.భానుప్రియ, 20వ వార్డు నుంచి అల్లుడు పల్లె శ్రీధర్‌బాబు పోటీ చేస్తున్నారు. మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ లేకపోవడం కూడా ఈ కుటుంబానికి లాభించింది. బహుశా గతంలో ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకే పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉండడం రికార్డుగా చెప్పుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement