
గులాబిరంగులో ఆహారభద్రత కార్డులు: ఈటెల
ఆహారభద్రత కార్డులను గులాబి రంగులో ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
ఆహారభద్రత కార్డులను గులాబి రంగులో ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. జనవరి నుంచి ఆహారభద్రత కార్డుల ద్వారానే బియ్యం పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కార్డులు ఇస్తామన్నారు.
ఈ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా ఉంటుందని రాజేందర్ చెప్పారు. ఆహారభద్రతా కార్డుల కంప్యూటరీకరణ 99 శాతం పూర్తయిందని ఆయన వివరించారు. సంక్షేమ హాస్టళ్లకు ఇకమీదట సూపర్ ఫైన్ రకం బియ్యాన్నే సరఫరా చేస్తామని తెలిపారు.