
ఒక్క రూపాయికే కేజీ బియ్యం: ఈటెల
ఒక్క రూపాయికే కేజీ బియ్యం ఇస్తామని తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు.
హైదరాబాద్: ఒక్క రూపాయికే కేజీ బియ్యం ఇస్తామని తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆహార భద్రత పథకంపై అధికారులతో కలిసి ఈటెల రాజేందర్ చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్హులందరికీ ఆహార భద్రత కార్డు ఇస్తాం అని ఆయన అన్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆహార భద్రత కార్డు, ఒక్క రూపాయికే కేజీ బియ్యం అందిస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.