హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన మిషన్ కాకతీయ.. కమీషన్ కాకతీయగా మారిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ లో ఎన్ని పనులు జరిగాయో వెల్లడించాలని గండ్ర డిమాండ్ చేశారు. మొక్కుబడిగా పనులు చేసి కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 'మిషన్ కాకతీయ'పై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇద్దరు సీఎంలు ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారని గండ్ర వెంకట రమణారెడ్డి దుయ్యబట్టారు.