ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం పాలఎల్లాపూర్ గ్రామం మాజీ ఎంపీటీసీ గుండెపోటుతో మృతి చెందారు.
కానాపూర్: ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం పాలఎల్లాపూర్ మాజీ ఎంపీటీసీ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం మాజీ ఎంపీటీసీ విజయ(55)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో ఆమెను పరిక్షీంచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విజయ భర్త ఎంపీటీసీగా ఉన్న సమయంలో మృతిచెందడంతో అతని స్థానంలో ఆమెను తిరిగి ఎన్నుకున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.