రుణమో.. బ్యాంకరూ..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఆకాశంలో మేఘాలు ఊరిస్తున్నాయి. చిరుజల్లులు కురిసిన కొద్దీ రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధం అవుతున్నారు. వారం రోజు ల్లో నైరుతి రుతుపవనాలు వస్తాయనే సమాచారంతో విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. వీటికి కావాల్సిన రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం రుణమాఫీ సమసేంత వరకు కొత్త రుణాలు ఇవ్వడం కుదరదని చెబుతున్నారు.
ఇక చేసేది లేక అదును దాటిపోయే పరిస్థితి ఉండటంతో అధిక వడ్డీలకైనా సరే అని ప్రైవేటు వ్యాపారుల ను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది వడ్డీదారులు పట్టాపాస్ బుక్ దగ్గర పెట్టుకొని, అగ్రిమెంట్, ఒప్పంద పత్రాలు రాయించుకుని 20 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలని రాయించుకు ని అప్పు ఇస్తున్నారు. పంటలను కూడా తమకే అమ్మాలని షరతు పెడుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోనే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ వ్యాపారం సాగుతోందని సమాచారం. రైతుల బతుకులు మారడం లేదు. దళారులు మాత్రం రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే కొందరు వడ్డీ వ్యాపారులు బ్యాంకుల వద్ద రుణం తీసుకుని రైతులకు అధిక వడ్డీకి ఇవ్వడం విశేషం.
80 శాతం సరుకు రూపేణా..
రైతులకు అప్పు కింద 80 శాతం సరుకు రూపే ణా, 20శాతం నగదు రూపేణా అందిస్తుంటా రు. ఉదాహరణకు పది ఎకరాల భూమి ఉన్న రై తుకు సుమారు రూ.20 వేల విలువ గల విత్తనా లు, రూ.20వేల విలువగల క్రిమిసంహారక మం దులు ఇస్తుంటారు. పంట కాలం మధ్యలో దీపావళి పండగ సమయంలో కలుపు తీసేందుకు మరో రూ.20 వేలు నగదుగా అందిస్తారు. రైతు వద్ద నుంచి పట్టాదారు పుస్తకం తీసుకోవంతోపాటు ప్రామిసరీ నోట్‌ను రాయించుకుంటారు.
జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఇలా ఉంటే తూర్పు ప్రాంతంలో ఇలా దళారుల దగ్గర నుంచే అప్పులు తీసుకున్న రైతులు పత్తి, ధాన్యం వాళ్లకే అమ్మాలి. మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువ ధర రూ.150 నుంచి రూ.250 లకు వారు కొనుగోలు చేస్తున్నారు. ఇచ్చిన అసలు రుణాలుకు వడ్డీ 20 శాతం రాయించుకున్న ఒప్పంద ప్రకారం చెల్లించాలని షరతులు పెడుతున్నారు. పంట పండిన తర్వాత సీజన్(జూన్ నుంచి జనవరి) మొత్తం అప్పుకు కలిపి 20 శాతం వడ్డీని వసూలు చేస్తుంటారు.
మరో మోసం.
కమీషన్ ఏజెంట్ల నుంచి అప్పులు తీసుకున్న రైతులు పంటను వారి ద్వారానే విక్రయించాలనే షరతు ఉంటుంది. రైతులు నేరుగా ఆయా కమీషన్ ఏజెంట్లు సూచించిన జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్లి పత్తిని విక్రయిస్తుంటారు. అక్కడ మధ్య దళారులు క్వింటాలుకు రూ.150 నుంచి రూ.250 చొప్పున ధర వ్యత్యాసం రైతు వద్ద సరుకును కొనుగోలు చేసి బడా వ్యాపారులకు విక్రయిస్తారు. వడ్డీ వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. రైతుల బతుకు మాత్రం మారడం లేదు. రైతులకు పండించిన పంటకు అసలు ధర రాక ఇటు తీసుకున్న రుణానికి అసలు వడ్డీ కట్టలేక అప్పుల ఊబిలో కురుకుపోయి. గత నాలుగైదు ఏళ్లలో అధికంగా ఆత్మహత్యల పాలవుతున్నారు.