లక్ష్మీదేవిపల్లి(కొత్తగూడెం), న్యూస్‌లైన్ : విధి నిర్వహణలో తనదైన శైలిలో నిత్యం రేయింబవళ్లు చురుకైన పాత్ర పోషిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు కొత్తగూడెం 108 పెలైట్ గంగ ఉమాశంకర్. ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరై విసుగనేది లేకుండా క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించడమే కాకుండా వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడు.
కొత్తగూడెం రామవరంలోని సీఆర్‌పీ క్యాంప్‌కు చెందిన గంగ ఉమాశంకర్ ఏడు సంవత్సరాలుగా 108 పెలైట్‌గా పని చేస్తున్నాడు. ఆయన నిత్యం పలు సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పలువురు అధికారులు, వ్యాపారులు, పలు సంఘాల నుంచే కాక 108 మేనేజ్‌మెంట్ నుంచి కూడా మంచి గుర్తింపు పొందారు. డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
ఇంటిపేరే ‘108’గా మారి...
జిల్లావ్యాప్తంగా 108 వాహనాలు 32 ఉన్నా యి. ఒక్కో వాహనంలోని ఐదుగురు సిబ్బం ది పనిచేస్తున్నారు. కొత్తగూడెం వాహనంలో గంగ ఉమాశంకర్ పెలైట్‌గా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. విధి నిర్వహణలో క్రమశిక్షణగా ఉంటూ ఇంటి పేరునే 108గా మార్చుకున్నాడు. ఉమాశంకర్ ఏడు సంవత్సరాలుగా ఎంతో మంది క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు.
ఎన్నో అవార్డులు.. సన్మానాలు...
విధి నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఉమాశంకర్‌కు ఎన్నో అవార్డులు దక్కాయి. 2008లో కొత్తగూడెం డీఎస్పీ, ఆర్డీఓ చేతులు మీదుగా భగవద్గీతను అందుకున్నారు. 2009లో జిల్లా మేనేజ్‌మెంట్ చేతులు మీదుగా మెమోంటో, 2011లో అప్పటి రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. 2013లో అప్పటి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అదే ఏడాది జీవికే ఈఎంఆర్‌ఐ ఆర్‌ఎల్‌ఓ సిద్ధార్థ భట్టాచార్య చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. అదే ఏడాది జీ. వెంృటకష్ణారెడ్డి చేతుల మీదుగా నేషనల్ లైఫ్ సేవియర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు వచ్చినందుకు 2013లో కొత్తగూడెం సింగరేణి డెరైక్టర్ విజయ్‌కుమార్ చేతులు మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. ఇవే కాక పట్టణంలోని పలువురు ఆయనను సన్మానించారు. బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.
‘సర్వీస్’లో భేష్
Published Wed, Jun 4 2014 1:36 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement