రుణం...‘రణం’ | give me distribution of lending to farmers | Sakshi
Sakshi News home page

రుణం...‘రణం’

Published Thu, Jun 5 2014 3:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రుణం...‘రణం’ - Sakshi

రుణం...‘రణం’

 ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతులకు రుణ పంపిణీ ప్రణాళికను ఇంకా అధికారులు, బ్యాంకర్లు ఖరారు చేయలేదు. దీంతో వారు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ కసరత్తు జరుగుతుండటంతో ఈ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ముంచుకు వస్తున్న సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని అన్నదాతలు తమ పనుల్లో నిమగ్నమై పోయారు.   వ్యవసాయ శాఖా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తోంది.
 
 సాక్షి, మహబూబ్‌నగర్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ... రైతులకు అందించాల్సిన పంట రుణాల లక్ష్యాన్ని ఇప్పటి వరకు అధికారులు ఖరారు చేయలేదు.ఈ ఏడాది రుతు పవనాలు సానుకూలంగా ఉండటంతో అడపాదడపా వర్షపు జల్లులు పడుతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ముందుగానే వర్షాలు పడే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయశాఖ కూడా ఖరీఫ్ పంట సాగు లక్ష్యాన్ని ఖరారు చేసి ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విత్తనాలు, ఎరువులు సరఫరాకు సన్నద్ధమవుతోంది.
 
 రైతులు కూడా దుక్కులు దున్నుకుని విత్తేందుకు  సిద్ధమవుతున్నారు. మరో వైపు పెట్టుబడుల కోసం పంట రుణాలు అం దించనున్న  బ్యాంకుల దుక్కు చూస్తున్నారు.  ఇప్పటి వరకు  జిల్లా అధికారయంత్రాంగం బ్యాంకర్ల సమావే శం నిర్వహించి 2014-15 సంవత్సరానికి సంబందిం చి ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులకు పంపిణీ చేయను న్న పంట రుణాల లక్ష్యాన్ని ఖరారు చేయలేదు. దీంతో ఏప్రిల్ మాసం నుంచి  జరగాల్సిన పంట రుణాల ప్రక్రియ  ఇంకా ప్రారంభించలేదు. ఏటా ఖరీఫ్‌కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, రబీలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బ్యాంకర్లు రైతులకు రుణ షెడ్యూల్‌గా నిర్ణయించాయి. ఇప్పుడిది ఆలస్యమవ్వడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తుతోంది.
 
 కొత్త ప్రభుత్వ హామీ నేపథ్యంలోనే...
 తెలంగాణ రాష్ట్ర తొలి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రూ. లక్ష  వరకు ఉన్న  రైతుల పంట రుణాలను  రద్దుకు హామీ ఇచ్చిన సంగతి విదితమే.అందులో భాగంగానే ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఆపాయింటెడ్‌డే ఈనెల 2గా నిర్ణయించడంతో సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్ పార్టీ తొలి ప్రభుత్వాన్ని అదేరోజు ఏర్పాటుచేసింది. సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రైతులకు పంట రుణాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశ్యంతో  రుణ మాఫీపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
 
అయితే లబ్దిదారుల సంఖ్య గుర్తించడం తదితర ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. రుణ మాఫీ ఆశతో  రైతులు కూడా తాము తీసుకున్న పంట రుణాలను బ్యాంకుల్లో జమ చేయలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకులు వాటికి సంబంధించిన వడ్డీని చెల్లిస్తే  ఖరీఫ్‌లో పంట రుణాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు రైతులు మాత్రం ఈ పని చేసినట్లు తెలుస్తోంది.  ఆర్‌బీఐ నుంచి మార్గదర్శకాలు అందగానే పంట రుణాలు పంపిణీ చేయగలమని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే ఈనెల 10-15 తేదీల్లో  బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించి 2014-15 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్, రబీ పంట రుణాలను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవంగా ఈ సమావేశం మేలోనే జరగాల్సిఉంది.
 
 గతేడాది పంట రుణం రూ. 2602 కోట్లు..
 జిల్లాలో గతేడాది 2013-14 సంవత్సరానికి గాను రైతులకు పంట రుణాలుగా రూ.2602 కోట్లు బ్యాంకులు పంపిణీ చేశాయి. ఖరీఫ్ సీజన్‌లో రూ.1251 కోట్ల లక్ష్యానికి గాను రూ.1287 కోట్లు అందజేయగా రబీలో రూ.1154 కోట్ల లక్ష్యానికి గాను రూ.1315 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తంగా 7,29,418 మంది రైతులకు ఈ పంట రుణాలను పంపిణీ చేసినట్లు బ్యాంకర్లు చెప్తున్నారు. ఇప్పుడు రుణ మాఫీ వర్తింప చేస్తే మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement