తెలంగాణలో పేదలకు ప్రభుత్వేఇల్లు కట్టిస్తుందని సీఎం కేసీఆర్ హామీయిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో పేదలకు ప్రభుత్వేఇల్లు కట్టిస్తుందని సీఎం కేసీఆర్ హామీయిచ్చారు. ఒక్కో ఇంటి్కి రూ. 5 లక్షలు ఖర్చు పెట్టనున్నట్టు చెప్పారు. 67 మున్సిపాలిటీల్లో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు.
సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇళ్ల తరహాలో అన్ని మున్సిపాలిటీల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ వివరాలు వెల్లడించారు.