
ఆయన ప్రాజెక్టులు కడితే..ఇప్పుడు పేర్లు మారుస్తున్నారు
వరంగల్: జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రాజెక్టులు కడితే ఇప్పుడున్న ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తుందని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్కు ముందు 17 మంది సీఎంలు ఆయన తర్వాత ముగ్గురు సీఎంలు పని చేశారన్నారు.
కానీ ఏ ముఖ్యమంత్రి కూడా వైఎస్ఆర్ చేసినన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు.