తెలంగాణ వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రంగారెడ్డి జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో సత్యం శ్రీరంగం, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గట్టు రామచంద్రరావు, సురేష్‌రెడ్డి, అమృతాసాగర్.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ప్రతి కార్యక్రమం చేవెళ్ల నుంచే ప్రారంభించేవారని, ఇకపై తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టే కార్యక్రమాలన్నీ చేవెళ్ల నుంచే మొదలుపెడతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిల్లా నేతలనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయని, వాటి పరిష్కార విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని అన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వె ళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని పిలుపుని చ్చారు. నిరంతరం ప్రజల్లోఉంటూ సమస్యలపై పోరాటం సాగించాలన్నారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం రోజుకో సర్వేతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని 48 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీ బలగమంతా తక్షణమే ప్రజల్లోకి వెళ్లాలని, గ్రేటర్ పరిధిలో సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారగణాన్ని నిలదీయాలని సూచిం చారు. 2019లో వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో బలీయశక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో భాగంగా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అమృతాసాగర్, యువజన విభాగం అధ్య క్షుడు సురేష్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగు మహిపాల్‌రెడ్డి, సీఈసీ సభ్యులు శ్రీరంగంసత్యం, నియోజకవర్గ నేతలు రుక్మారెడ్డి, ప్రభుకుమార్, సూర్యనారాయణరెడ్డి, ముస్తాక్ అహ్మద్, చెరుకు శ్రీనివాస్, నాగిరెడ్డి, కె.రాఘవరెడ్డి తదితరులు త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలనుద్దేశించి సలహాలు, సూచనలిచ్చారు.