రైతును రాజుగా చేసింది మహానేతే..
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువై ఉన్నారని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో పొంగులేటి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మహానేత వైఎస్‌ఆర్ సువర్ణ పాలన అందించారన్నారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనన్నారు. రైతులకు ఉచిత కరెంటు, పంట రుణాలమాఫీ తదితర బృహత్తర పథకాలతో మహానేత పాలనలో రైతులను రాజు చేశారన్నారు. మహిళలు, విద్యార్థులు, యువత, మైనార్టీలు, నిరుద్యోగులు, వృద్ధులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని తెలిపారు. దీంతో మహానేత మృతి చెందిన ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారంటే ఆయన చేపట్టిన బృహత్తర పథకాలే కారణమన్నారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని, సీఎం ఎన్నికల ముందు చేసిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ మేరకు మహానేత అందించిన సువర్ణ పాలన కోసం వైస్సార్ సీపీ కట్టుబడి ఉన్నందున.. మహానేత తనయుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.సభలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నియోజక వర్గ ఇన్‌చార్జి మునిగాల విలియం, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగల్ల సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, బాలెముల మధు, మండల పార్టీ అధ్యక్షుడు ఊరడి శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, నోముల జయపాల్‌రెడ్డి, ఎండీ.మోసిన్‌అలీ, ఆసిఫ్, ఆజాం, రంజిత్‌కుమార్, వంశీ, భరత్, జంగం రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల గుండెల్లో దేవుడిలా వైఎస్‌ఆర్
Published Fri, Nov 20 2015 2:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement