నిజామాబాద్ అర్బన్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. 68 శాతం మంది ఉత్తీర్ణులయ్యూరు. గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది 62.64 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 4,283 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,921 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇం దులో బాలురు 1,997 మంది పరీక్షలు రాయగా 1,220 పాసయ్యూరు. ఉత్తీర్ణత శాతం 61.09గా నమోదయ్యింది. బాలికలు 2,286 మంది పరీక్షలు రాయగా 1,701 ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణత శాతం 74.41. మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల 93.18 శాతం తో మొదటి స్థానంలో నిలిచింది. మద్నూరు జూనియర్ కళాశాల 91.29 శాతంతో రెండో స్థానం పొందింది. జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 91.13 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మూడో స్థానంలో నిలిచింది.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదయ్యూంది. ఇక్కడ 6.58 శాతం విద్యార్థులే పాసయ్యూరు.
ఒకేషనల్ విభాగం
జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులు 73.02 శాతం ఉత్తీర్ణులయ్యూరు. గతేడాది ఉత్తీర్ణత శాతం 52గా నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా 341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 249 మంది ఉత్తీర్ణులయ్యారు. కోటగిరి కళాశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. బాల్కొండ 94.44 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో ఉంది. ఆ ర్మూర్ బాలుర ఒకేషనల్ కళాశాలలో ఒక్క వి ద్యార్థి మాత్రమే ఉండగా.. జీరో శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నిజామాబాద్ బాలుర కళాశాలలో 72 మందికిగాను 29 మంది పాసయ్యా రు. 40.28 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిం ది.
ఎయిడెడ్ కళాశాలల్లో..
ఈ ఏడాది ఎయిడెడ్ కళాశాలల్లో జిల్లావ్యాప్తంగా 142 మంది పరీక్షలకు హాజరు కాగా 21 మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యూరు. 15 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 100 మంది పరీక్షకు హాజరు కాగా 11 మంది, బాలికలు 42 మంది పరీక్ష రాయగా 10 మంది పాసయ్యారు. గతేడాది 18 శాతం ఉత్తీర్ణులయ్యూరు.
కామారెడ్డి ఎరుుడెడ్ కళాశాలలో 31.48 శాతం, ఆదర్శ హిందీ మహావిద్యాలయంలో 13.73 శాతం, సీఎస్‌ఐ జూనియర్ కళాశాలలో 5.3 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సీఎస్‌ఐ జూనియర్ కళాశాలలో 56 మంది విద్యార్థులకుగాను ముగ్గురు మాత్రమే పాసయ్యూరు.
గురుకులాల్లో..
జిల్లాలోని గురుకుల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో 666 మంది గురుకుల విద్యార్థులు పరీక్షలు రాయగా 593 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.04 ఉత్తీర్ణత శాతం నమోదయ్యింది. పోచారంపాడ్, ధర్మారం, బ్రాహ్మణపల్లిలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదరుు్యంది. సుద్దపల్లిలో 98.61 శాతం, భిక్కనూరులో 98. 68 శాతం, ఉప్పల్‌వాయిలో 98.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాన్సువాడ గురుకుల పాఠశాలలో అతి తక్కువగా 43.24 శాతమే ఉత్తీర్ణులయ్యూరు.
జిల్లాలో గల ఏకైక ట్రైబల్ కళాశాల (గాంధారి)లో 31 మందికిగాను 31 మంది ఉత్తీర్ణులయ్యారు.
‘ఆదర్శ’లో..
ఆదర్శ కళాశాలల్లో 68.31 శాతం ఉత్తీర్ణత నమోదరుు్యంది. జిల్లాలో 16 పాఠశాలలు ఉండగా 506 మంది పరీక్షలకు హాజరయ్యూరు. ఇందు లో 346 మంది పాసయ్యూరు. డిచ్‌పల్లి ఆదర్శ పాఠశాలలో 44 మంది పరీక్షలు రాయగా 42 మంది(95.45 శాతం) ఉత్తీర్ణులయ్యూరు.
సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో 38 మం దికాగాను 35 మంది(92.11శాతం), మేనూ రు ఆదర్శ పాఠశాలలో 27 మందికిగాను 24 మంది(88.89 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
అతి తక్కువగా జక్రాన్‌పల్లి ఆదర్శ పాఠశాల లో 39 మందికిగాను 8 మంది విద్యార్థులే పాసయ్యూరు. ఇక్కడ ఉత్తీర్ణత 20.51 శాతం గా నమోదరుు్యంది.
ఫలితాల్లో ‘ప్రభుత్వ’ జోరు
Published Wed, Apr 29 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement