
హైదరాబాద్: నూతన సంవత్సరం(2018)లో ప్రభుత్వ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు 24 సాధారణ సెలవులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 17 రోజులు ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవు(నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్) రోజులు 21గా ఖరారు చేసింది. ఇవిగాక తాము ప్రకటించిన ఐచ్ఛిక సెలవు రోజులలో ఐదింటిని ఉద్యోగులు వాడుకునేందుకు అనుమతించింది. దానికి అధీకృత ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని సూచించింది. పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాపనుల శాఖలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించబోవని, వాటికి సంబంధిత శాఖలు ప్రత్యేకంగా సెలవుల జాబితాను విడుదల చేస్తాయని తెలిపింది. ఈదుల్ ఫితర్, ఈదుల్ జుహా, మొహర్రం, ఈద్-ఇ-మిలాద్‌లలో మార్పులు జరిగితే అందుకనుగుణంగా సెలవు తేదీలు మారుతాయని పేర్కొంది.