సమరయోధులకు సన్మానం
వరంగల్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సాయుధ పోరులో అమరులైన వీరులకు నివాళులర్పించారు. సమర యోధులను సన్నానిం చారు. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్స వం నిర్వహించాలని రాజకీయ పక్షాలన్నీ డిమాండ్ చేశాయి. ఈ విషయాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిసారి ఖిలావరంగల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన చోట మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు.
టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, డీసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, హన్మకొండలోని పోలీస్‌హెడ్‌క్వార్టర్స్ ఎదుట ఏబీవీ పీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. డీసీసీ కార్యాలయంలో ముందుగా జెండాను తిల కిందులుగా ఎగుర వేసిన డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తర్వాత తప్పిదాన్ని గుర్తించి జెండాను కిందకు దించి సరిచేసి మళ్లీ ఎగురవేశారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ కోర్టులో జెడాను ఆవిష్కరించారు.
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించిన సీపీఎం నాయకులు విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. దొడ్డికొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల స్మృతి చిహ్మనం వద్ద, మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు హాజరయ్యారు. పరకాల అమరధామం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. మహబూబాబాద్, నర్సంపేట, వర్ధన్నపేట, హసన్‌పర్తి, తొర్రూరు, పాలకుర్తి, భూపాల్‌పల్లి, ఏటూరునాగారం, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గడ్‌లలో తెలంగాణ సాయుధ పోరాటయోధులను ఘనంగా సన్మానించారు. దేవరుప్పులలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయూలపై జాతీయు జెండాను బీజేపీ కార్యకర్తలు ఎగురవేశారు. డోర్నకల్‌లో సీపీఐ (ఎం-ఎల్) ఆధ్వర్యంలో విద్రోహ దినంగా పాటించారు.
ఘనంగా విమోచన దినోత్సవం
Published Thu, Sep 18 2014 2:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement