'కృష్ణా బోర్డుకు నీటి కేటాయింపులు చేసే హక్కు లేదు' | harish rao blames krishna water board | Sakshi
Sakshi News home page

'కృష్ణా బోర్డుకు నీటి కేటాయింపులు చేసే హక్కు లేదు'

Published Fri, Oct 31 2014 8:46 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

'కృష్ణా బోర్డుకు నీటి కేటాయింపులు చేసే హక్కు లేదు'

'కృష్ణా బోర్డుకు నీటి కేటాయింపులు చేసే హక్కు లేదు'

హైదరాబాద్:కృష్ణా బోర్డుకు నీటి కేటాయింపులు చేసే హక్కు లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కృష్ణా బోర్డు తన పరిధిని అతిక్రమించినట్లు తాము భావిస్తున్నామన్నారు. శ్రీశైలం-నాగార్జునసాగర్ నదీ జలాల వినియోగం విషయంలో తమ సమస్యలను బోర్డుకు తెలియజేస్తామన్నారు. ఏపీ సర్కారు ఫిర్యాదు ఇవ్వగానే స్పందించిన కృష్ణాబోర్డు, తెలంగాణ ఫిర్యాదును పట్టించుకోలేదని హరీష్ రావు మండిపడ్డారు. బోర్డు ఉత్తర్వులపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామన్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదని కేంద్రమంత్రులు తెలిపిన సంగతిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమకు రాష్ట్రంతో పాటు రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. దానికి అనుగుణంగా స్పందిస్తామని హరీష్ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement