ఆత్మవిశ్వాసంతో కదలాలి
- యువతకు మంత్రి హరీశ్‌రావు పిలుపు
- సిద్దిపేటలో జాబ్‌మేళా.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
సాక్షి, సిద్దిపేట: యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ఆయన హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన 51 కంపెనీలను ఒకేవేదిక మీదకు తీసుకొచ్చి 4,391 పోస్టులను సృష్టించారు. ఈ కార్యక్ర మానికి దాదాపు ఐదు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ అన్వే షణ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావా ల్సిందేనని, అలాంటి దానికి ఈ జాబ్ మేళాను తొలిమెట్టుగా వినియోగించు కోవా లని సూచించారు.
ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా రాణించాలంటే ఉన్న గ్రామాన్ని వదిలి బయటికి రావాలని, అలా వచ్చిన వాళ్లే ఉద్యోగంలో రాణిస్తారని చెబుతూ హెటిరోడ్రగ్స్ చైర్మన్ పార్థసారథిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి పేరును మం త్రి ప్రస్తావించారు. రాష్ట్రంలో పశువుల డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని, 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఖాళీలు భర్తీ చేద్దామంటే ఆ కోర్సులో పోస్టు గ్రాడ్యు యేష న్ పూర్తి చేసిన అభ్యర్థులు దొరకడంలేదని చెప్పారు. సర్వేయర్ పోస్టులకు కూడా డిమాండ్ ఉందని, యువత ఇలాంటి కోర్సు లను ఎంచుకోవాలని మంత్రి సూచించారు.