సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : బోధన్ మండలం సాలూర, మద్నూరు చెక్‌పోస్టులతోపాటు భిక్కనూరు మండలంలోని పొందుర్తి ఆర్‌టీఏ చెక్ పాయింట్లలో పని చేసేందుకు ఎంవీఐలు, ఏఎంవీఐలు, డీసీటీఓలు, ఏసీటీఓలు హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారు. అందుకోసం రూ.లక్షలు పెట్టుబడి పెట్టేందుకూ వెనుకాడటం లేదు. ఏసీబీ దాడు లు జరుగుతాయని తెలిసినా పోస్టింగుల కోసం ఎగబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులను జిల్లా అధికారులు పక్కనపెడుతున్నట్లు తెలిసింది.
తమ కనుసన్నలలో మెలుగుతూ మాట తప్పకుండా మామూళ్లు ఇచ్చేవారికే చెక్‌పోస్టులలో ప్రాధాన్యమిస్తున్నారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా ఈ తంతు రవాణా, వాణిజ్య పన్నులశాఖలలో నడుస్తోంది. అర్హత, అనుభవం, సిన్సియారిటీ ఉన్నా, లంచం పెట్టే స్థాయిలేక అవకాశాలు కోల్పోతున్నామని కొందరు రవాణా, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పరుగెత్తి పాలు తాగేకన్నా... నిలబడి నీళ్లు తాగడమే మంచిందంటూ’ వారిని వారే ఊరడించుకుంటున్నారు.
పోటీ పడుతూ
రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండే చెక్‌పోస్టులలో పనిచేసేందుకు రవాణా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఏ స్థాయిలోనైనా రూ. లక్షలు లంచంగా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. లంచం ఇవ్వలేరన్న కారణంతో ని కొందరికి పోస్టింగులు దక్కడం లేదు. దీంతో వారు ఉన్నతాధికారుల వైఖ రిపై ఉద్యోగులు అక్కసు వెళ్లబోసుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి
ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం 8 మంది ఎంవీఐలు, 20 మంది ఏఎంవీఐలను బదిలీ చేసింది. అందులో 90 శాతం మందికి చెక్‌పోస్టులలోనే పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎం వీఐలు రూ. పది లక్షలు, ఏఎంవీఐలు రూ. ఆరు లక్షల వరకు చెల్లించినట్లు అప్పట్లో ఆ శాఖలోనే బహిరంగ చర్చ జరిగింది. బదిలీ ఉత్తర్వులకు ముందు కరీంనగర్, ఆ దిలాబాద్, వరంగల్ జిల్లాలలో పనిచేస్తున్న ఎంవీఐలు, ఏఎంవీఐలను కొందరు పైరవీకారులు సంప్రదించినట్లు సమాచారం.
అంత డబ్బు పెట్టలేమంటూ కొందరు దూరముండగా, ఇంకొందరు ఔత్సాహికులు ఆసక్తి చూపారన్న ప్రచారం కూడా జరిగింది. ఉమ్మడి తనిఖీ కేంద్రాలపై అజమాయిషీ బాధ్యత వాణిజ్య పన్నులశాఖదే. డీ సీటీఓ స్థాయి అధికారే ఏఓగా వ్యవహరిస్తారు. ఆ పోస్టుకు రూ. పది లక్షలపైనే ధర పలుకుతున్నట్లు సొంత శాఖలోనే ప్రచారం ఉంది. ఏసీటీఓలు సైతం రూ. ఎనిమిది లక్షల వరకు చెల్లించేందుకు వెనుకాడటం లేదు. దీనిని బట్టి చూస్తే చెక్‌పోస్టులలో డ్యూటీలు ఎంత ఖరీదో అర్థం చేసుకోవచ్చు.
పట్టువదలని విక్రమార్కులు
ఇతర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పట్టణాలు, నగరాలలో పోస్టులు కోరుకుంటారు. రవాణా, వాణిజ్యపన్నుల శాఖలలో పనిచేసే కొందరు అధికారులు మాత్రం సరిహద్దులో ఉండే చెక్‌పోస్టులంటేనే సంబరపడిపోతున్నారు. వేలం పాటల ఆధారంగా అధికంగా చెల్లించేవారే రవాణాశాఖలో నెట్టుకొస్తున్నారన్న అపవాదు ఉంది. ఇదే క్రమంలో ముగ్గురు ఏఎంవీఐలు జిల్లాకు చెందిన చెక్‌పోస్టులో కొద్దిరోజుల క్రితం పోస్టింగ్ ఇచ్చారన్న ఆరోపణలు ఆశాఖ నుంచే వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సుధీర్ఘకాలం చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్లలో పనిచేసిన ఓ ఎంవీఐ ఎక్కడికీ కదలడం లేదన్న ఆరోపణ కూడా ఉంది. ఏసీబీ కేసులలో ఇరుక్కున్న ఇద్దరు అధికారులు సై తం, తిరిగి ఇక్కడే విధులు నిర్వహించడం విశేషం. ఇలా రవాణా, వాణిజ్య పన్నుల శాఖలలో ఆర్థిక, అధికార బలం ఉన్న అధికారులు, ఉద్యోగులే చెక్‌పోస్టుల లో పదే పదే పనిచేస్తుంటే, తమకెప్పుడు అవకాశం వస్తుందంటూ ఆయా శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చెక్‌పోస్టులు హాట్ గురూ!
Published Tue, Aug 26 2014 1:58 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement