ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో బేల మండలం సిరసన్న వద్ద నాలుగు లారీలు బురదలో కూరుకుపోయాయి. దీంతో మహారాష్ట్ర వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. దాంతో దాదాపు మూడు గంటల పాటు వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.