ఇంటర్మీడియెట్‌ బోర్డులో హెల్ప్‌డెస్క్‌.. | Helpdesk at Intermediate Board | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియెట్‌ బోర్డులో హెల్ప్‌డెస్క్‌..

Published Sun, Nov 26 2017 4:00 AM | Last Updated on Sun, Nov 26 2017 4:00 AM

Helpdesk at Intermediate Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటైంది. ఈ డెస్క్‌ను విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, బోర్డు కార్యదర్శి ఏ అశోక్‌ శనివారం ప్రారంభించారు. బోర్డు పరంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యాలు ఎదుర్కొనే సమస్యలను ఈ డెస్క్‌తో పంచుకోవచ్చని వారు చెప్పారు. వాటిని వీలైనంత త్వరితంగా పరిష్కరిస్తామని తెలిపారు. హెల్ప్‌డెస్క్‌కు వచ్చే ప్రతి కాల్, మెయిల్‌ రికార్డ్‌ చేయబడుతుందని, ఫిర్యాదులను పరిష్కరించాక సదరు ఫిర్యాదుదారుడికి సంక్షిప్త సమాచారాన్ని అందిస్తామన్నారు.

ఈ హెల్ప్‌ డెస్క్‌ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అయితే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు, ఫలితాల వెల్లడి, ఇతర అత్యవసర సమయాల్లో 24 గంటలు పనిచేస్తుందని అశోక్‌ తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలనుకున్నవారు 040– 24600110 నంబర్‌లో లేదా  helpdesk- ie@telangana.gov.in మెయిల్‌ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement