మొబైల్‌ ల్యాబ్స్‌తో కరోనా పరీక్షలు.. | High Court Says TS Government To Available Of Corona Tests In Mobile Labs | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ల్యాబ్స్‌తో కరోనా పరీక్షలు..

Published Fri, Jun 19 2020 1:00 AM | Last Updated on Fri, Jun 19 2020 1:00 AM

High Court Says TS Government To Available Of Corona Tests In Mobile Labs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైద్య పరీక్షల కోసం మొబైల్‌ ల్యాబ్స్‌ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. ఇప్పటికే వీటివల్ల కేరళలో మంచి ఫలితాలు వచ్చాయని తెలి పింది. అయితే ఈ తరహా ప్రతిపాదన ప్రభు త్వం వద్ద లేదని, సంచార వైద్య పరీక్షల ల్యాబ్స్‌ ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కరోనా తీవ్రత దృష్ట్యా సంచార వైద్య పరీక్షల ల్యాబ్‌ల ఏర్పాటు అవసరం ఎంతగానో ఉం దని పేర్కొంది. ఈ నెల 29లోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని, విచారణను ఈ నెల 30న జరుపుతామని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైద్య సంబంధిత ప్రజాహిత వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. 

డాక్టర్‌ నుంచి బాయ్‌ వరకు పీపీఈ కిట్లు
‘జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరా లను వార్డుల వారీగా ప్రకటించాలి. ఆ వివరాలను స్థానిక కాలనీ అసోసియేషన్లకు అంద జేయాలి. రోజూ కరోనా బులెటిన్‌ మీడియాకు తెలపడంతోపాటు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. జిల్లాల్లో కరోనా ఆస్పత్రు లుగా గుర్తించిన వాటి గురించి ప్రభుత్వం విçస్తృత ప్రచారం చేయాలి. గాంధీకే కరోనా వైద్య సేవలు పరిమితం కాలేదని ప్రజలకు తెలియజేయాలి. కేరళలో అమలు చేస్తున్న ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలను వైద్య సిబ్బంది చేసేందుకు ఉన్న అడ్డంకు లేమిటో చెప్పాలి. మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ అమలుకు ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలియ జేయాలి. వైద్యం చేసే డాక్టర్‌ నుంచి వార్డు బాయ్‌ వరకు అందరికీ పీపీఈ కిట్లు ఇవ్వాలి. గాంధీలో తరహాలోనే జిల్లాల్లోనూ డాక్టర్లు, ఇతర సిబ్బందిని షిఫ్టు విధానంలో సగం మంది సర్వీసులనే వాడుకోవాలి. పది రోజుల్లో 50 వేల పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యాన్ని సాధించేలా చర్యలుండాలి. ఇందుకు యాంటి జెన్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను వినియోగించాలి. పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికీ నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ఐసీఎంఆర్‌ నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగి, వెంట వచ్చే సహాయకులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలి...’ అని ధర్మాసనం ఆదేశించింది.

జీహెచ్‌ఎంసీలో లక్ష్యానికి అనుగుణంగా టెస్టులేవీ?
తొలుత అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 16 నుంచి జీహెచ్‌ఎంసీలో పది రోజుల్లో 50 వేల పరీక్షలను చేయడం ప్రారంభించామన్నారు. దీనిపై హైకోర్టు కల్పించుకుని, సగటున రోజుకు లక్ష్యం 5 వేలు అయితే ఈ నెల 16, 17 తేదీల్లో 1,873, 1,096 పరీక్షలను మాత్రమే చేశారని, లక్ష్యానికి అనుగుణంగా పరీక్షలు చేయాలని సూచించింది. నిమ్స్‌ అటానమస్‌ కావడం వల్లే అక్కడ కరోనా వైద్య సేవలు చేయడం లేదని ఏజీ చెప్పారు. ఇటు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు హాజరయ్యారు. కరోనా వైద్యం చేసే 46 ఆస్పత్రుల్లో వైద్యసేవల్లో ఉన్న అందరికీ పీపీఈ కిట్లను ఇచ్చామని శ్రీనివాసరావు చెప్పారు.

పీపీఈ కిట్లు 1.57 లక్షలుంటే 1.23 లక్షలను వినియోగించామని చెప్పారు. ఎన్‌–95 మాస్క్‌లు 2.59 లక్షలు వినియోగించగా ఇంకా 85 వేలకు పైగా ఉన్నాయని, త్రీలేయర్‌ మాస్క్‌లు 4.59 లక్షలు, 3 లక్షల సర్జికల్‌ గ్లౌజులు, 1.47 లక్షల టెస్టింగ్‌ గ్లౌజ్‌లు, 26 వేల శానిటైజర్లున్నాయన్నారు. ఇటు గాంధీ ఆస్పత్రి వద్ద 274 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారని, గాంధీలో 441 మంది కరోనా బాధితులు వైద్యం పొందుతున్నారని రాజారావు చెప్పారు. 50 శాతం వైద్యులే విధుల్లో ఉంటారని, వైద్యం చేస్తున్న కారణంగా వారి కుటుంబసభ్యుల జాగ్రత్తల నిమిత్తం వారికి బయట వేరే వసతి ఏర్పాట్లు చేశామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement