సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌లో నిబంధనలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నియమావళిని తమ ముందు ఉంచాలని ఈసీని ఆదేశించింది. అయితే ఈ సందర్భంగా ఎన్నికల మాన్యువల్ అందుబాటులో లేదని తెలిపిన ఎన్నికల సంఘం.. రేపటి వరకు గడువు కోరింది.
దీంతో రేపు సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రేపు ఉదయం 10.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నట్టు తెలిపింది. కాగా, రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment