
హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలి
► స్వీయ అధికారాల విషయంలో తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
► ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘ఏదైనా కేసులో ఓ నిందితుడు తనపై దర్యాప్తు సంస్థ పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖ లు చేసినప్పుడు, హైకోర్టులు ఆ పిటిషన్ ను కొట్టివేస్తున్న సమయంలో, ఆ నిందితుడిని అరెస్ట్ చేయవద్దని దర్యాప్తు సంస్థలను ఆదేశి స్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నిందితుడిని కింది కోర్టు ముందు లొంగి పోవాలని చెబుతు న్నాయి. అనంతరం ఆ వ్యక్తికి షరతులతో బెయిల్ మంజూరు చేయాలని కింది కోర్టులను నిర్దేశిస్తున్నాయి. ఇలా చెయ్యడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇందుకు ఏ చట్టం కూడా అనుమతించదు.’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్, చాంద్రాయణ గుట్ట పోలీసులు 2014లో హబీబ్ అబ్దుల్లా జిలానీ, హబీబ్ అల్ జిలానీ, ఒమర్ బిన్ ఆబేద్ తదిత రులపై హత్యాయత్నంతో పాటు పలు నేరాలకింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తమను అన్యాయంగా ఈ కేసులో ఇరికిం చారని, తమపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ వారు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు, వారి పిటిషన్ ను కొట్టేస్తూ దర్యాప్తు నిలుపుదలకు నిరాకరించింది. దర్యాప్తు జరుగుతున్న వరకు వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచార ణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు నిచ్చింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును తప్పుపట్టింది.
హైకోర్టులు తమ స్వీయ అధికారాలను ఉపయోగించి పరిమితులకు లోబడి కేసును కొట్టేయవచ్చునని,ప్రస్తుత కేసులో ఆ పని చేయని ఉమ్మడి హైకోర్టు నిందితులను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలి చ్చిందని, ఇది ఎంత మాత్రం సరికా దంటూ పోలీసుల తరఫు సీనియర్ న్యాయ వాది హరీన్ రావల్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టుకు విస్తృత అధికారాలున్నాయని, ఆ అధికారాలను ఉపయోగించే ముందు న్యాయస్థానాలు తమ బాధ్యతలను గుర్తెరగా లంది. కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలయ్యే పిటిషన్ల విషయంలో న్యాయసా ్థనాలు అప్రమ త్తంగా ఉండాలి’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.ఘ