సింగరేణి నిప్పుల కొలిమి
► ఓసీపీపై 48 డిగ్రీలు నమోదు
► బెంబేలెత్తుతున్న కార్మికులు
► ఓసీపీల్లో మారిన పని వేళలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల): భానుడి ప్రతాపా నికి సింగరేణి కార్మికులు బెంబేలెత్తుతున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉండ టంతో బొగ్గుబాయిలపై దీని ప్రభావం పడింది. మధ్యాహ్నం డ్యూటీలకు వెళ్లి పనిచే యడం కార్మికులకు ఇబ్బందిగా మారింది. క్వారీల్లో 2 రోజులుగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవు తోంది. కార్మికులు ఎండబారిన పడకుండా ఉండేందుకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (ఓసీ పీ)లో ఈ నెల 7వ తేదీ నుంచే షిఫ్ట్ వేళలు మార్చా రు.
ఉదయం షిఫ్ట్ ఇంతకు ముందు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే దాన్ని ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే కుదించారు. 2వ షిఫ్ట్‌లో కూడా గంట సమయం కుదించి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తు న్నారు. పని చేసేటప్పుడు ప్రతి కార్మికుడికి మస్టర్ పడే సమయంలో మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. నీరసంగా ఉందన్న కార్మి కులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు.