
సాక్షి, జనగామ : వడ్లకొండ చంపక్ హిల్స్ ప్రాంతంలో ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తోంది. అయితే పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తీసుకున్న భూములకు తగిన పరిహారం ఇవ్వాలని సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.