బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. మండల కేంద్రానికి చెందిన పుల్లూరి రమేష్ అనే వ్యాపారి కుటుంబసభ్యులతో కలసి శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదు, ఇరవై తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు.