
రామకృష్ణాపూర్: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. న్యూ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భీమా రాజేశ్వరి సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తొంది. కాగా, రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు బలవంతంగా నెట్టి లోనికి ప్రవేశించాడు. అప్పటికే నిద్రలో ఉన్న రాజేశ్వరి మెడలో ఉన్న రెండు తులాల మంగళసూత్రం చోరీ చేశాడు.
ఏదో అలజడి అనిపించి లేచి చూడగానే ఇంట్లో గుర్తు తెలియని వారు ఉన్నారు. వెంటనే బాధితురాలు బిగ్గరగా అరవడంతో వారు పారిపోయాడు. కేసును నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment