
ముగిసిన లిటరరీ ఫెస్టివల్
రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మూడ్రోజులుగా జరుగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆదివారం ఘనంగా ముగిసింది.
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మూడ్రోజులుగా జరుగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆదివారం ఘనంగా ముగిసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులతో మూడురోజులు ప్రాంగణం కిటకిటలాడింది. యువ రచయితలకు సూచనలు, సలహాలతో పాటు పలు సదస్సులు నిర్వహించారు. ఫ్రీ స్పీచ్, సెన్సార్‌షిప్‌పై ప్రముఖ రచయితలు నయనతార సెహగల్, టొంగమ్ రీనా, ఊర్మిళ పవార్ ప్రసంగించారు. లిటరేచర్ ఆఫ్ సింగపూర్ పొయెట్రీ, ఫిక్షన్‌లపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా హాజరయ్యారు.