హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేం దుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. నగరంలో శాంతిభద్రతలు, ఉగ్రవాదులదాడులపై చేపట్టిన చర్యలు ఏంటని, మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ప్రతి కూడలిలో ఆరుగురు పోలీసుల బృందం ఉంటుందని, సమాచారం అందుకున్న ఐదు నిమిషాల్లో సంఘటనాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశామన్నారు. ఐఎస్‌ఐ, సిమీ, జమాతే తదితర ఉగ్రవాదసంస్థల కదలికలపై నిఘాను పటిష్టం చేశామన్నారు. వివిధ బాంబు పేలుళ్లకు, స్థానికులకు సంబంధం లేదన్నారు.