పట్టించుకోని అధికారులు
శివ్వంపేట: పంచాయతీ నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్న సంబందిత వివరాలను సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో సంబందిత ఉన్నతాధికారులు నిర్లక్షయ దోరణి అవలంబిస్తున్నారు. మండలంలోని నవాబుపేట గ్రామ పంచాయతీకి సంబందించిన నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచాయతీ పరిధిలో అధికంగా పరిశ్రమలు ఉండడంతో పంచాయతీకి ఆదాయం భారీగా ఉంది. దీంతోపాటు బీఆర్‌జీఎఫ్, సాధారణ నిధులు పంచాయతీ ఖాతాలో జమ అవుతుంటాయి. మండలంలోని నవాబుపేట పంచాయతీకే అధిక ఆదాయ వనరులు ఉన్నాయి. దీన్ని ఆసరగా చేసుకొని పంచాయతీకి వచ్చిన నిధులను ఖర్చు చేయడంలో అక్రమాలకు పాల్పడిన విషయాన్ని గతనెలలో జరిగిన గ్రామసభలో సభ్యులు లేవనెత్తారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఇద్దరు కలిసి చేపట్టని పనులకు సైతం రికార్డులు సృష్టించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో 15లక్షల ఆదాయం రాగా అందుకు సంబందించిన ఖర్చులు పూర్తిస్థాయిలో చూపకపోవడం మూలంగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు పాల్పడిన వారిపై పూర్తి విచారణ చేపట్టి నిధులను రికవరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతు పంచాయతీ సభ్యులు కలెక్టరేట్‌లో సైతం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెలరోజులు అవుతున్నా నేటికి ఎలాంటి విచారణ చేపట్టలేదు. అవినీతిలో అధికారులకు సంబందం ఉండడంతోనే పూర్తి వివరాలు చెప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు బయటకు పొక్కకుండా మండల స్థాయి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ఆరులక్షల అవినీతి..
గత రెండు సంవత్సరాల కాలంలోగ్రామ పంచాయతీకి 15లక్షల ఆదాయం రాగా 6లక్షల వరకు అవినీతి చోటుచేసుకుందని ఉపసర్పంచ్ అశోక్‌రెడ్డి, వార్డు సభ్యులు సంగీత, వెంకటేశ్, నగేష్, ఆంజనేయులు ఆరోపించారు. సర్పంచ్ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి నరేందర్‌రెడ్డిలు కుమ్మక్కై నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో చేసిన పనులకే మల్లీ రికార్డులు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
నివేదిక కోరతాం..
పంచాయతీ నిధుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర నివేదిక కోరనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు ఫోన్‌ద్వారా చెప్పారు. దుర్వినియోగమైన నిధులపై సమగ్ర విచారణ చేపట్టి అవినీతి చోటుచేసుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
పక్కదారి పట్టిన పంచాయతీ నిధులు
Published Mon, May 18 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement