సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్ద పీట వేశారు. సోమవారం ప్రకటించిన కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం లభించింది. పార్టీ తరఫున ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ శాసనసభాపక్ష నేత తాటివెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 11 మంది సభ్యులను రాష్ట్ర కమిటీలో నియమించగా, అందులో ముగ్గురు మన జిల్లా వారే కావడం గమనార్హం. అయితే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గట్టు రాంచందర్‌రావును కూడా రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆయన కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వారే. ఆయనతో కలిపి మొత్తం నలుగురికి కమిటీలో స్థానం లభించినట్టయింది. రాష్ట్ర కమిటీలో జిల్లాకు సముచిత ప్రాధాన్యం లభించడం పట్ల పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్ద పీట
Published Tue, Sep 9 2014 1:44 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement