అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
► జేసీ రాంకిషన్
► సివిల్ సప్లయ్ రవాణా టెండర్ల ఖరారు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను లారీల ద్వారా టెండర్‌దారులు ఎమ్మెల్‌ఎస్ గోదాంల నుంచి నేరుగా చౌకధర దుఖానాలకు తరలించాలని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎం రాంకిషన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని 24 ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సంబంధించి దాఖలైన టెండర్ దరఖాస్తులను పరిశీలించగా శుక్ర వారం వాయిదా పడిన 18 టెండర్లను శనివారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా జేసీ రాంకిషన్ మాట్లాడుతూ ఎమ్మెల్‌ఎస్ గోదాం నుంచి లారీలు సరుకుల లోడ్‌తో నేరుగా కేటాయించిన గ్రామాలలోని చౌకధర దుఖానాలకు చేరుకోవాలని సూచించారు. ఎమ్మెల్‌ఎస్ గోదాముల నుంచి సరకులు రవాణా చేసే ప్రతీ లారీని జీపీఎస్‌తో అనుసంధానించనున్నట్లు తెలిపారు.
ఈ సారి కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సారి మంచి రేటును నిర్ణయించిందని, క్వింటాలుకు రూ. 12 నుంచి రూ.17ల వరకు ఇస్తోందన్నారు. టెండర్‌దారులు ఈ విషయాన్ని గమనించి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాఖలైన టెండర్లలో నిరే ్ధశించిన రేటు ప్రకారం ఎవరు తక్కువ ధరకు దాఖలు చేస్తే వారికి టెండర్లను అప్పగించారు. ఒకే రేటుకు దాఖలు చేసిన టెండరుదారుల పేర్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో సివిల్‌సప్లై డీఎం బిక్షపతి, డిఎస్వో రాజారావు, మాజీ డీఎం ప్రసాదరావు, టెండర్‌దారులు పాల్గొన్నారు. జిల్లాలోని 24 ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల వారీగా రవాణా టెండర్లు దక్కించుకున్న వివరాలిలా ఉన్నాయి.